కింగ్‌డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలతో బిజీగా ఉన్నారు. విజయ్ మూవీ రౌడీ జనార్ధన్ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ యాక్షన్ మూవీలో ప్రముఖ స్టార్ హీరో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి వల్ల తమిళంలోనూ ఫుల్ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ చిత్రానికి కోలీవుడ్లో కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం వల్ల తమిళ ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి పెంచునుంది. దేవరకొండ- విజయ్ సేతుపతి మధ్య ఫైట్ సీన్స్ చూసే ఛాన్స్ ఫ్యాన్స్కు దక్కనుంది. కాగా.. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.


