
తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా.. మనిషి ధర్మం తప్పకుండా ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు. జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయనవేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ‘సీతారాముల పాటలు’ ఇప్పుడు చూద్దాం.