చంటబ్బాయిగారి తాలుకా..! | Sreekakulam Sherlock Holmes Teaser launch: Tollywood | Sakshi
Sakshi News home page

చంటబ్బాయిగారి తాలుకా..!

Nov 29 2024 4:24 AM | Updated on Nov 29 2024 4:24 AM

 Sreekakulam Sherlock Holmes Teaser launch: Tollywood

‘వెన్నెల’ కిశోర్‌ ప్రధానపాత్రలో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. చంటబ్బాయిగారి తాలూకా’ క్యాప్షన్‌. ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, సీయా గౌతమ్‌ హీరోయిన్లుగా, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలో నటించారు. రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మోహన్‌ మాట్లాడుతూ–‘‘ఫస్ట్‌ కాపీ చూసిన తర్వాత వంశీగారు చెప్పిన మార్పులు, ఆయన ఈ సినిమా తీసుకోవడం మాకు చాలా కాన్ఫిడెన్స్‌ ఇచ్చాయి’’ అన్నారు.

‘‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు ఫుల్‌మీల్స్‌ లాంటిది’’ అన్నారు అనన్యా నాగళ్ల. ‘‘కంటెంట్‌ని నమ్మి తీసిన చిన్న సినిమాలు ‘2018, కమిటీ కుర్రాళ్ళు, ఇటీవల రిలీజ్‌ అయిన ‘క’.., ఇవన్నీ ప్రేక్షకులను అలరించాయి. నిర్మాత వంశీగారిది గోల్డెన్‌ హ్యాండ్‌.  ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ విజయం సాధించి, మోహన్‌గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ‘కమిటీ కుర్రాళ్ళు’ ఫేమ్‌ దర్శకుడు యదు వంశీ.  

Advertisement
 
Advertisement
Advertisement