ఆ అనుభవంతో సినిమాలో నటించడం ఈజీ అయింది: సోను ఠాగూర్

Sonu Thakur Talk About Nenu Meeku Baaga Kavalsina Vadini Movie - Sakshi

కిరణ్‌ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా, సోను ఠాగూర్  హీరోయిన్లుగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని(NMBk)’. ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన  పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌  సోను ఠాగూర్  మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆ తరువాత నేను మోడల్ గా కేరీర్ ప్రారంభించాను. మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే ‘జోరుగా హుషారుగా’ సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ పాటకు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. 

ఎన్నో హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, నిర్మాత కోడి దివ్యదీప్తి, హీరో కిరణ్‌ అబ్బవరంతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. 

మోడల్‌గా చేసిన అనుభవం ఉండడం వల్ల సినిమాలో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ఈ సినిమాలో లాయర్ పాప సాంగ్ చేశాను. ఈ పాటకు  ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో నాకు రన్ టైమ్ తక్కువ ఉన్నా ఫుల్ ఫన్ ఉంటుంది. బాబా భాస్కర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీగా ఉంది. తను ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటాడో, ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటాడు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దీప్తి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. కో స్టార్ కిరణ్ చాలా కూల్ పర్సన్ తనతో కలసి డ్యాన్స్ చేయడం హ్యాపీ గా ఉంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. తన సంగీతంలో వర్క్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top