Sonu Sood: New Movie Fateh Poster Released - Sakshi
Sakshi News home page

Sonu Sood: సోనూ సూద్‌ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్‌ విడుదల

Dec 24 2021 7:41 AM | Updated on Dec 24 2021 7:55 AM

Sonu Sood New Movie Fateh Poster Released - Sakshi

Sonu Sood New Movie Fateh Poster Released: రియల్ హీరో సోనూ సూద్‌ లీడ్‌ రోల్‌లో రూపొందనున్న చిత్రం ‘ఫతే’. ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన అభినందన్‌ గుప్తా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ‘భారతదేశంలో దాక్కున్న ఒక శత్రువుపై ఒక వ్యక్తి చేసే యుద్ధం’ అని ఉంది. ‘‘కథ విన్న వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. ఆలోచింపజేసే ఈ కథను అందరికీ చూపించాలి. 2022ని మరింత యాక్షన్‌తో స్వాగతిస్తున్నాను’’ అన్నారు సోనూ సూద్‌. 

సోనూసూద్‌ అంటే లాక్‌డౌన్‌ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్‌డౌన్‌ తర్వాత కథ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్‌ హీరో అయ్యాడీ రీల్‌ విలన్‌. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్‌ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్‌ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్‌.

Advertisement
 
Advertisement
Advertisement