40 గ్రామాల విద్యార్థినిలకు సోనూసూద్‌ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

Sonu Sood Distributes Smartphones To Lucknow 40 Villages Female Students - Sakshi

సోనూసూద్‌ పేరు వింటే చాలు ఎక్కడ ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్నారో అనేలా అయిపోయింది. కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నావారికి సాయం చేస్తూ జనం గుండెల్లో రియల్‌ హీరోగా నిలిచిపోయారు. తాజాగా ఆయన సాయంలో మరో ముందడుగు వేశారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 

విద్యార్థులేమో పాఠాలు వినడానికి ఎలాంటి దారి దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సోను నేనున్నా చేయుత అందించారు. ఆయన ఉదారతను చాటుకుంటు లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్‌ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఫోన్లు అందుకున్న ఆ విద్యార్థినిలంత సోనూకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top