లాక్‌డౌన్‌ తర్వాత రిలీజైన తొలి పెద్ద సినిమా గుర్తుందా?

Solo Brathuke So Better Is The First Movie Released After Lockdown - Sakshi

గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ టీమ్‌ తీసుకుంది. సినిమా రిలీజ్‌ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’.

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడి, డిసెంబర్‌ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి,  మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌ వంటి స్టార్స్‌ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు.  అప్పటినుంచి మెల్లిగా  సినీ పరిశ్రమ  తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్‌ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ వేసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top