కోలీవుడ్‌లో కొత్త కాంబో.. కలిసి నటించబోతున్న ఇద్దరు నటధీరులు! | SJ Suryah Joins Cast Of Chiyaan Vikram 62th Film, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Chiyaan 62th Movie Update: కోలీవుడ్‌లో కొత్త కాంబో.. కలిసి నటించబోతున్న ఇద్దరు నటధీరులు!

Published Sun, Feb 11 2024 9:34 AM

SJ Suryah Joins Cast of Chiyaan Vikram 62th Film - Sakshi

కోలీవుడ్‌లో ఓ కొత్త కాంబోకు శ్రీకారం జరిగింది. ఇందులో ఇద్దరు నటధీరులు కలిసి నటించబోతున్నారు. అందులో ఒకరు విక్రమ్‌. ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం ఉండదు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతవరకై నా వెళ్లే అతి కొద్దిమంది నటుల్లో విక్రమ్‌ ఒకరు. నిరంతర శ్రమజీవి. స్వశక్తితో ఎదిగిన నటుడు. తంగలాన్‌ చిత్రంతో ఈయన తన విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. దీంతో విక్రమ్‌ తాజాగా తన 62వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఇంతకుముందు పన్నైయారుమ్‌ పద్మినియుమ్‌, సేతుపతి, సింధు బాద్‌, సిత్త వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ నిర్మాత శిబూ తమీన్స్‌ వారసురాలు రిషి శిబూ నిర్మించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ నిర్మాత శుక్రవారం వెల్లడించారు. ఇందులో మరో నట రాక్షసుడు ఎస్‌జే సూర్య ముఖ్యపాత్రను పోషించనున్నారన్నదే ఆ అప్‌డేట్‌. ఇటీవల ఈయన విశాల్‌తో కలిసి నటించిన మార్క్‌ ఆంటోని, రాఘవ లారెన్స్‌తో కలిసి నటించిన జిగర్తండ–2 వంటి చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో విక్రమ్‌తో కలిసి ఈయన నటించబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. త్వరలో సెట్స్‌పైకి రావడానికి సిద్ధమవుతున్న ఈ క్రేజీ కాంబో చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement