Sivakarthikeyan: శివ కార్తికేయన్ 'ప్రిన్స్' నుంచి సెకండ్ సింగిల్ అవుట్

నటుడు శివకార్తికేయన్ డాన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ప్రిన్స్'. ఈ చిత్రం ద్వారా తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు, తమిళం భాషల్లో రపొందుతున్న ఈ చిత్రానికి జాతి రత్నాలు చిత్రం ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా ఉక్రెయిన్ దేశానికి చెందిన మరియ రియా పోషస్క పరిచయం కావడం విశేషం.
నటుడు సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.తమన్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణ అందిస్తున్నారు. కాగా దీనిని అరుణ్ విశ్వకు చెందిన శాంతి టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ ఎల్ బి, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది.
ఈ చిత్రంలోని పింపిలిక్కీ పిలాప్పీ అనే పాటను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పెన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ప్రిన్స్ చిత్రం నుం జెస్సికా ఉన్ బాయ్ ఫ్రెండ్ పదవి ఎనక్కా అనే పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోందని, ఇప్పటికే మిలియన్‌లకు పైగా ప్రేక్షకులు ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్రం దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.