Mahesh Babu Shares His Daughter Sitara First PMJ Jewels Advertisement Video On Instagram - Sakshi
Sakshi News home page

Sitara Ad Video: ప్రిన్సెస్‌లా మెస్మరైజ్ చేసిన సితార

Jul 19 2023 4:57 PM | Updated on Jul 19 2023 5:10 PM

Sitara First Ad Video Mahesh Babu Post - Sakshi

Sitara Ad Video: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన తర్వాతి తరాన్ని కూడా అప్పుడే పరిచయం చేసేశాడు. కొడుకు గౌతమ్ ఓ సినిమాలో నటించాడు. కాకపోతే అది చైల్డ్ ఆర్టిస్ట్‌ రోల్. కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కూతురు సితార మాత‍్రం ఇప్పటి నుంచే తండ్రి మించిపోయేలా అలరిస్తోంది. 

(ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలున్నారు.. బాంబు పేల్చిన తెలుగు హీరోయిన్‌)

సితారకు ప్రస్తుతం 11 ఏళ్లు. అయితేనేం ఏ సెలబ్రిటీ కిడ్‌కి సాధ్యం కాని విధంగా ఓ యాడ్‌లో నటించింది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సరే ఎంత అందుకుంది అనేది పక్కనబెడితే ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేసినట్లు స్వయంగా ఆమెనే బయటపెట్టింది. అలానే ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ యాడ్‌ని తొలుత ప్రదర్శించారు. ఇప్పుడు ఆ యాడ్ పూర్తి వీడియోని మహేశ్‌బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు.

ఈ యాడ్ వీడియోలో సితార.. చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. కొన్నిచోట్ల యాక్టింగ్‌లో మెరుపడాల్సి ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్రెజెన్స్, హైట్, స్కిన్ కలర్ తదితర అంశాల్లో మాత్రం తండ్రి మహేశ్‌ని మించిపోతుందేమో అనిపించేలా ఉంది. త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సితార.. ఆల్రెడీ డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకుంది. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస‍్తుందో చూడాలి.

(ఇదీ చదవండి: మెగాహీరో సినిమాలకు దూరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement