భర్తతో కలిసి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న సునీత.. ఫోటోలు వైరల్‌

Singer Sunitha Attends Hero Nithin Birthday Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తొలి సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన యంగ్‌ హీరో నితిన్‌. నేడు (మార్చి30)న 38వ ఏటలోకి అడుగుపెట్టాడు. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్‌ బర్త్‌డే కావడంతో భార్య షాలిని సహా అత్యంత సన్నిహితుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి నితిన్‌ ఇంట్లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో సింగర్‌ సునీత తన భర్త రామ్‌ వీరపనేనితో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సునీత-రామ్‌ దంపతులకు ఇటీవలె పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వీరి ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఓ పార్టీని హీరో నితిన్‌ స్వయంగా ఏర్పాటు చేశాడు. సునీత భర్త రామ్‌తో నితిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా నితిన్‌ బర్త్‌డే వేడుకల్లో అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. ఈ లిస్ట్‌లో సింగర్‌ సునీత దంపతులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది చెక్‌సినిమాతో వచ్చిన నితిన్‌..రంగ్‌దే చిత్రంతో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్‌ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు.


చదవండి : నితిన్‌ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? 
రామ్‌ అలా ప్రపోజ్‌ చేశాడు : సింగర్‌ సునీత

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top