గౌతమ్‌ మీనన్‌తో ముచ్చటగా‌ మూడోసారి | Simbu and Gautham Menon to collaborate again | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ మీనన్‌తో ముచ్చటగా‌ మూడోసారి

Jan 30 2021 1:35 AM | Updated on Jan 30 2021 8:22 AM

Simbu and Gautham Menon to collaborate again - Sakshi

కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్‌ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది

తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మూడోసారి ఒక ప్రాజెక్ట్‌కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్‌ మీనన్‌) చిత్రాలు వచ్చాయి. లాక్‌డౌన్‌లో ‘కార్తీక్‌ డయల్‌ సెయ్‌ ద ఎన్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ కూడా చేశారు శింబు, గౌతమ్‌ మీనన్‌. ఐ ఫోన్‌తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్‌ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్‌ మీనన్‌. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్‌ అని ప్రచారంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement