వైభవంగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి.. హనీమూన్‌కు నో ఛాన్స్..! | Sakshi
Sakshi News home page

Kiara- Siddarth Wedding: కియారా-సిద్ధార్థ్ హనీమూన్ లేనట్లే.. ఎందుకంటే..!

Published Tue, Feb 7 2023 9:28 PM

Sidharth and Kiara Advani to SKIP honeymoon due to work commitments - Sakshi

బాలీవుడ్​ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్​ మల్హోత్ర పెళ్లి​ ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు బీటాన్ క్యూట్ కపుల్ కియారా, సిద్ధార్థ్. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను కోసం దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు.

అయితే నూతన వధూవరులు మాత్రం హనీమూన్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వారి కెరీర్ ప్రణాళికల్లో భాగంగా మరికొన్ని వాయిదా వేసుకుంటారని సమాచారం. అయితే వీరి వివాహా ఆచారాల కారణంగా పెళ్లి చేసుకున్న వెంటనే హానీమూన్‌కు వెళ్లరట. జైసల్మీర్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక పంజాబీ, సింధు కుటుంబ ఆచారాల ప్రకారం వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. 

అంతే కాకుండా సిద్ధార్థ్.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే కియారాకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇద్దరూ తమ వర్క్ కమిట్‌మెంట్ పూర్తి చేసిన తర్వాతే హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్, కియారా స్పందించలేదు. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట అతియా శెట్టి-కేఎల్ రాహుల్ సైతం హనీమూన్‌ వేడుకను వాయిదా వేసుకున్నారు. 

పెళ్లి తర్వాత ఇద్దరూ రెండు గ్రాండ్‌గా రిసెప్షన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12న ముంబైలోని తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం, ఫిబ్రవరి 9న దిల్లీలోని వరుడి కుటుంబ సభ్యుల కోసం మరో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పెళ్లిలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, రామ్ చరణ్, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్‌తో పాటు వ్యాపార దిగ్గజం ఇషా అంబానీతో సహా అనేక మంది స్నేహితులను హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement