ధనుష్‌ సరసన చాన్స్‌ కొట్టేసిన శింబు మూవీ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Dhanush: ధనుష్‌ సరసన చాన్స్‌ కొట్టేసిన శింబు మూవీ హీరోయిన్‌

Published Tue, Sep 27 2022 11:04 AM

Siddhi Idnani Get Offer In Dhanush Upcoming Movies - Sakshi

దేనికైనా అదృష్టం ఉండాలంటారు. ప్రతిభ ఎంత ఉన్నా అది ఒక్కటే చాలదు. అదే విధంగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చిత్రాల్లో నటించే హీరోయిన్లకు లక్‌ గ్యారెంటీ అనే టాక్‌ ఉంది. అలాంటి లక్కే ఇప్పుడు సిద్ధి ఇద్నానిని వరించనుందనే టాక్‌ కోలీవుడ్‌లో స్ప్రెడ్‌ అవుతోంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వెందు తనిందదు కాడు’. ఇందులో గుజరాతీ నటి సిద్ధి ఇద్నాని కథానాయకిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఈ సంతోషంతో దర్శకుడు, కథానాయకులకు భారీ బహుమతులను కూడా అందించారు. ఈ విషయాన్ని అటుంచితే ఇందులో నాయకిగా నటించిన సిద్ధి ఇద్నానికి మరో లక్కీ ఛాన్స్‌  వరించినట్లు సమాచారం. నటుడు ధనుష్‌తో రొమాన్స్‌ చేసే అవకాశమే అది. ఈ సంచలన నటుడు తన అన్నయ్య సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన నానే వరువేన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29వ తేదీ తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాత్తి చిత్రంతో పాటు కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాల్లో ధనుష్‌ నటిస్తున్నారు.

కాగా మరో చిత్రంలో నటించడానికీ ఈయన పచ్చజెండా ఊపారు. దీనికి ఇళన్‌ దర్శకత్వం వహించనున్నారు. 2015లో  విడుదలైన  గ్రహణం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హరీష్‌ కల్యాణ్‌ హీరోగా ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజా ధనుష్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇందులో నటి సిద్ధి ఇద్నానిని నాయకిగా ఎంపిక చేయనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. మొత్తం మీద ఈ అమ్మడు  కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటోందన్న మాట. 

Advertisement
 
Advertisement
 
Advertisement