‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్‌కు అంత రెమ్యునరేషనా?!

Sidd​​harth Take Rs 3 Crore Remunaration For Maha Samudram Movie - Sakshi

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత హీరో సిద్దార్థ్‌ ‘మహా సముద్రం’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్‌ శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నాడు. కాగా శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాయ్స్‌’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దు 2005లో విడుదలైన ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా..’ మూవీతో తెలుగులో స్టార్‌ హీరోగా మారాడు.

ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇ​క ‘బొమ్మరిల్లు’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న సిద్దుకు ఆ తర్వాత పెద్దగా హిట్స్‌ లేవు. చివరగా ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రంతో అభిమానులను అలరించిన అతడు తెలుగు తెరకు దూరమై 9 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత మహా సముంద్రంతో మళ్లీ ప్రేక్షలకును అలరించడానికి వస్తున్నాడు సిద్దు. ఇదిలా ఉండగా ఈ మూవీలో సిద్దార్థ్‌ రెమ్యూనరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

పూర్తిగా తెలుగులో పేడ్‌ అవుట్‌ అయిన హీరోగా పేరు తెచ్చకున్న సిద్దు మహాసముద్రం మూవీకి 3 కోట్ల రూపాయల పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న చాలా మంది షాక్‌ అవుతున్నారు. ఇప్పుడున్న తెలుగు కుర్ర హీరోలలో ఎవరికి ఇంతటి పారితోషికం లేదని, తొమ్మిదేళ్ల తర్వాత కూడా సిద్దార్థ్‌ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యం అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఆదితి రావు హైదరిలు కథానాయికలుగా నట్తిసున్నారు. త్వరలోనే మహాసముద్రం మూవీ విడుదల కానుంది. 

చదవండి: 
‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్‌.. ఫస్ట్‌లుక్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top