‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల | Siddharth First Look Out From Maha Samudram Movie | Sakshi
Sakshi News home page

‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

Apr 18 2021 8:25 AM | Updated on Apr 18 2021 9:14 AM

Siddharth First Look Out From Maha Samudram Movie - Sakshi

‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో శర్వానంద్‌ మరో హీరోగా నటిస్తున్నారు. అదితీరావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. శనివారం సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో క్యూలో నిలబడి ఎవర్నో చూస్తున్నారు సిద్ధార్థ్‌. ‘‘ఇంటెన్స్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది.

తెలుగులో తన కమ్‌బ్యాక్‌ మూవీకి సరైన స్క్రిప్ట్‌ కోసం చాలాకాలం ఎదురుచూసిన సిద్ధార్థ్‌కి ‘మహాసముద్రం’ కథ నచ్చి, నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో శర్వానంద్‌ కొంచెం అగ్రెసివ్‌ లుక్‌లో కనిపించగా, సిద్ధార్థ్‌ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: అజయ్‌ సుంకర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిశోర్‌ గరికిపాటి, సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: రాజ్‌ తోట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement