మా తల్లిదండ్రులు విడిపోవడమే మంచిదయింది! : శ్రుతిహాసన్‌

Shruti Haasan Talks About Her Parents Divorce - Sakshi

కమల్‌హాసన్, సారికల పెద్ద కుమార్తె, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ దాదాపు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు.. ఇటీవల ఓ సందర్భంలో తన తల్లిదండ్రులు విడిపోయిన విషయం గురించి మాట్లాడారు శ్రుతి. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తనకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది అన్నారామె. ఇంకా శ్రుతి మాట్లాడుతూ – ‘‘మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పుడు నేను ఎగ్జయిట్‌ కావడానికి కారణం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంలేదని వారికి అనిపించింది. ఆ తర్వాత విడాకులు తీసుకోవాలనుకున్నారు. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడం కరెక్టేనని, వారి నిర్ణయం గౌరవించదగ్గదేనని అనిపించింది.

వ్యక్తులుగా వారు విడిపోయినా తల్లిదండ్రులుగా నాకు, నా చెల్లెలి  (హీరోయిన్‌ అక్షరా  హాసన్‌)కి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యక్తిత్వాలు వేరుగా ఉన్న ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు. వారు విడాకులు తీసుకున్నప్పుడు నేను యంగ్‌ ఏజ్‌లో ఉన్నాను. మా తల్లిదండ్రులు కలిసి లేరన్న విషయాన్ని పక్కన పెడితే, విడివిడిగా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలా హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా’’ అన్నారు. 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top