లక్కీ హీరోయిన్‌.. అన్ని సినిమాలూ సూపర్‌ హిట్టే! | Sakshi
Sakshi News home page

Shruti Haasan: సీనియర్‌ హీరోలతో జోడీ కట్టిన బ్యూటీ.. శృతి ఉంటే సక్సెస్‌ ఖాయమే!

Published Mon, Dec 25 2023 2:33 PM

Shruti Haasan Delivers Continuous Hits in Tollywood 2023 - Sakshi

శృతి ఉంటే సక్సేస్‌ ఖాయమేనా? ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అన్నట్టు శృతి అంటే సంగీతంలో శృతి లయలు అనుకునేరు. ఇక్కడ శృతి అంటే హీరోయిన్‌ శృతి హాసన్‌. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలైన ఈమె కథానాయికగా హిందీలో నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇక మాతృభాష అయిన తమిళంలో నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు చిత్రపరిశ్రమ కావడం విశేషం. అంతేకాదు ఇక్కడ సీనియర్‌ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారారు.

స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన బ్యూటీ
శృతి హాసన్‌ తెలుగులో పవన్‌ కల్యాణ్‌, రవితేజ, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్‌ హీరోలతో జత కట్టారు. అంతకు ముందు వరకు ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోలతో శృతిహాసన్‌ నటించిన చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడం విశేషమనే చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది', 'గబ్బర్‌ సింగ్‌' చిత్రాల్లో, రవితేజతో 'బలుపు', 'క్రాక్‌' చిత్రాల్లో నటించగా ఇవి మంచి విజయాలను సాధించాయి. ఇక ఈ బ్యూటీ ఈ ఏడాది నటించిన నాలుగు చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడం విశేషం.

శృతి ఉంటే సినిమా హిట్టే
చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలై సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక ఇటీవల నాని, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన హాయ్‌ నాన్న చిత్రంలో శృతిహాసన్‌ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికీ మంచి ఆదరణ లభించింది. తాజాగా ప్రభాస్‌కు జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ బాక్సాఫీస్‌ వద్ద రిలీజై వసూళ్ల మోత మోగిస్తోంది. దీంతో తెలుగు చిత్రాల్లో శృతి ఉంటే సక్సెస్‌ ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రవితేజతో మరోసారి జతకట్టబోతున్నారు. అదేవిధంగా కన్నడంలో ఒక చిత్రం, ఆంగ్లంలో ఓ చిత్రం చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

చదవండి: ధనుష్‌ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్‌ కామెంట్స్‌ వైరల్‌..

Advertisement
 
Advertisement