అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్‌ | Sakshi
Sakshi News home page

అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్‌

Published Wed, Oct 4 2023 12:44 AM

Sharwanand At Mama Mascheendra Pre Release - Sakshi

‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్‌ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్‌. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్‌ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్‌ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్‌ సేన్‌. ‘‘సుధీర్‌ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’  అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్‌. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్‌ కూడా పెద్ద డైరెక్టర్‌ కావాలి’’ అన్నారు పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు.

Advertisement
 
Advertisement
 
Advertisement