ఆలస్యంగా వస్తున్న జవాన్‌ | Shah Rukh Khan Jawan by director Atlee postponed | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వస్తున్న జవాన్‌

May 7 2023 4:55 AM | Updated on May 7 2023 4:55 AM

Shah Rukh Khan Jawan by director Atlee postponed - Sakshi

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్‌ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్‌ దత్, దీపికా పదుకోన్‌ నటించారు.

తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్‌’ సినిమాను షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్‌ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్‌ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ పెండింగ్‌ ఉండటం ‘జవాన్‌’ రిలీజ్‌ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్‌ సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement