ఓటీటీలో సీటీమార్‌, స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌! | Seetimaarr Streaming From 15th October On Disney Hotstar | Sakshi
Sakshi News home page

Seetimaarr: హాట్‌స్టార్‌లో సీటీమార్‌, ఎప్పటినుంచంటే?

Oct 8 2021 8:39 PM | Updated on Oct 9 2021 9:54 AM

Seetimaarr Streaming From 15th October On Disney Hotstar - Sakshi

‘గౌతమ్‌ నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్‌– డైరెక్టర్‌ సంపత్‌ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్‌’. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు. అప్సరా రాణి ‘పెప్సీ ఆంటీ’ అనే ఐటెం సాంగ్‌తో దుమ్ము దులిపేసింది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న వినాయక చవితి కానుకగా థియేటర్‌లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్టాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 'సీటీమార్‌' స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఈ నెల 15 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఇదివరకే థియేటర్లలో సినిమా చూసిన అభిమానులు దసరా పండగరోజు మరోసారి ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement