టిఎస్ఆర్ మూవీ మేకర్స్ మరో క్రేజీ సినిమా ప్రారంభం | TSR Movie Makers Next Project Schedule Plan Details | Sakshi
Sakshi News home page

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ మరో క్రేజీ సినిమా ప్రారంభం

Apr 28 2025 11:52 AM | Updated on Apr 28 2025 12:09 PM

TSR Movie Makers Next Project Schedule Plan Details

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో ఒక చిత్రం రానుంది. ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక  హార్ట్‌టచ్‌ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా,  ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ, భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.

విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయని తెలిపారు. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి ఈ చిత్రం ద్వారా మంచి కుటుంబ జోనర్‌ ఉన్న కథను ఎంపిక చేసుకున్నారు.

దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఈ బ్యానర్‌లో తికమక తాండ, కొబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని గుర్తుచేశారు.కొబలి సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన హాట్‌స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యిందన్నారు. అలాంటిది ఈ బ్యానర్‌లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement