ఫ్యాన్‌ మూమెంట్‌: విజయ్‌తో సారా సెల్పీ

Sara Ali Khan Shares A Selfie Photo With Vijay Devarakonda - Sakshi

టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు కూడా ఎంతోమంతి ఫ్యాన్స్‌ అయిపోయారు. అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌తో ఈ ‘రౌడీ’ స్టార్‌కు బాలీవుడ్‌లో కూడా అమాంతం క్రేజ్‌ పెరిగిపోయింది. బాలీవుడ్‌ భామలు సైతం అతడికి అభిమానులు అయిపోయారు. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదాహరణ. గతవారం ముంబై వెళ్లిన విజయ్ అక్కడ ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ పార్టీకి బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ కూడా వచ్చింది. ఈ క్రమంలో అక్కడ విజయ్‌తో ఆమె తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.  దీనికి ‘ఫ్యాన్‌ మూమెంట్‌’ అంటూ విజయ్‌ను ట్యాగ్‌ చేసింది. దీంతో ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతొంది‌. ఇక అది చూసిన విజయ్‌ అభిమానులంత మురిసిపోతున్నారు. 

ప్రస్తుతం విజయ్..‌ మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్‌’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందులో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 13న) కరణ్‌ నివాసంలో నిర్వహించిన పార్టీకి విజయ్‌ని ఆహ్వానించాడు. ఈ పార్టీలో విజయ్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ నటీనటులు దీపికా పదుకొనె, ఇషాన్‌ ఖట్టర్‌, అనన్య పాండే, సిద్దార్థ్‌ చతుర్వేదీలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

చదవండి:
రౌడీ ఫ్యాన్‌కు గుడ్‌ న్యూస్‌..‘లైగర్’వచ్చేస్తున్నాడు
‘అర్జున్‌ రెడ్డి’ కాంబినేషన్‌ రిపీట్‌?
అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top