Suraapanam Movie Teaser: డైరెక్టర్‌, హీరో అన్నీ అతడే.. సురాపానం టీజర్‌ చూశారా?

Sampath Kumar Suraapanam Movie Teaser Released - Sakshi

సంపత్‌ కుమార్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’ (కిక్‌ అండ్‌ ఫన్‌). ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా టీజర్‌ని ‘భీమ్లా నాయక్‌’ ఫేమ్‌ దర్శకుడు సాగర్‌ కె. చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సురాపానం’ టైటిల్‌కి తగ్గట్టుగా టీజర్‌ కూడా చాలా బాగుంది. థ్రిల్, వినోదం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు.

సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్, కంప్లీట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. సరికొత్త కథాంశంతో వస్తున్న ‘సురాపానం’ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం మా సినిమా సెన్సార్‌లో ఉంది.. మే చివరి వారంలో చిత్రం విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్, సూర్య , ఫిష్‌ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్‌ చంద్ర, సురభి ప్రభావతి, త్రిపుర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

చదవండి: సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్‌

యశ్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ దాకా.. కేజీఎఫ్‌ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top