ఓటీటీలో​కి సమంత యశోద.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే.. | Samantha Yashoda Movie Ott Release Date Fix Details Here | Sakshi
Sakshi News home page

Yashoda OTT Release Date : ఓటీటీలోకి వచ్చేస్తున్న యశోద.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

Dec 6 2022 10:44 AM | Updated on Dec 6 2022 11:40 AM

Samantha Yashoda Movie Ott Release Date Fix Details Here - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి-హరీష్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌11న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. రూ. 30కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి సత్తా చాటింది. ముఖ్యంగా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతూనే సమంత ఈ చిత్రానికి డబ్బింగ్‌ కంప్లీట్‌ చేయడం మరో విశేషం.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యశోద ఓటీటీలోకి రావాల్సి ఉండగా ఈవా వివాదంతో ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఆ ఆస్పత్రి వర్గాలతో యశోద మేకర్స్ చర్చించి సమస్యను పరిష్కారించారు.

ఇక ఇప్పుడు లైన్‌ క్లియర్‌ అవడంతో యశోదను స్ట్రీమింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 9న యశోద చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement