పాండిచ్చేరిలో సమంత సందడి

Samantha Went Pondicherry For Kaathu Vaakula Rendu Kadhal Movie Shooting - Sakshi

ప్రేమ కోసం పాండిచ్చేరి పయనమయ్యారు హీరోయిన్‌ సమంత. విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్షన్‌లో విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో సమంత పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని తెలిసింది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఇటీవలే మైథాలజీ ఫిల్మ్‌ ‘శాకుంతలం’ షూటింగ్‌ను సమంత పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top