108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత | Samantha Starts Weekend With 108 Surya Namaskar | Sakshi
Sakshi News home page

108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత

Sep 12 2020 5:52 PM | Updated on Sep 12 2020 8:26 PM

Samantha Starts Weekend With 108 Surya Namaskar - Sakshi

ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్‌ సమంత. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కఠినమైన వర్కౌట్లు చేస్తారు. ఇక లాక్‌డౌన్‌ కాలంలో భర్త నాగచైతన్యతో కలిసి యోగా చేయడం ప్రారంభించిన సమంత.. ఈ వీకెండ్‌ను సరికొత్త ఫీట్‌తో ఆరంభించారు. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి వావ్‌ అనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో చేశారు. ఈ వారాంతానికి ఒక మంచి ఆరంభం అన్న సమంత.. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్‌.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్‌కట్లు ఉండవని ఆమె నిరూపించారు. కఠిన శ్రమ, అంకిత భావం, సుస్థిరతకు నిదర్శనం. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ నో చెప్పరు’’అని సమంతపై ప్రశంసలు కురిపించారు.(చదవండివయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు )

కాగా లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు సమంత. టెర్ర‌స్ గార్డెనింగ్ మొద‌లు పెట్టి మన ఆహారం మనమే పండించుకోవాలి, అంతేకాదు వాటికి కావాల్సిన ఎరువులను కూడా సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో చెబుతూ సోషల్‌ మీడియాలో పలు వీడియోలు షేర్‌ చేశారు. ‘గ్రో విత్‌ మీ’ అంటూ మంచు లక్ష్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితర నటీమణులకు సవాల్‌ విసిరారు. అదే విధంగా వంట చేయ‌డం కూడా నేర్చుకున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న సమంత.. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టారు. ఇందులో ఆమె టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆమె వ్యాపారం రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ క్వీన్‌గా అభిమానుల చేత ప్రశంసలు అందుకున్న సామ్‌.. 'సాకీ వరల్డ్' పేరుతో యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా వస్త్ర‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement