The Family Man 2: టెర్రరిస్టు లుక్‌లో సమంత.. ఫోటో వైరల్‌ | Samantha Look Released From Family Man 2 | Sakshi
Sakshi News home page

The Family Man 2: టెర్రరిస్టు లుక్‌లో సమంత.. ఫోటో వైరల్‌

Apr 28 2021 9:08 PM | Updated on Apr 29 2021 10:28 AM

Samantha Look Released From Family Man 2 - Sakshi

సమంత తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ నుంచి ఓ ఫోటోని విడుదల చేశారు మేకర్స్‌.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత 34వ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌ 28).  ఈ సందర్భంగా ఆమె తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’నుంచి ఓ ఫోటోని విడుదల చేశారు మేకర్స్‌. గతంలో బ్యాక్ సైడ్ వ్యూ లో ప్యాంటు షర్ట్ ధరించి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న సమంత ఫోటోని రిలీజ్‌ చేసిన మేకర్స్‌.. తాజాగా ఆమె ఫేస్ రివీల్ చేసి షాక్ ఇచ్చారు. ఇందులో ఆమె డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ ఫోటోలో దర్శకద్వయం రాజ్ - డీకే కూడా ఉన్నారు.

ఈ పిక్ షేర్ చేసి ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్! హ్యాపీ డే రచ్చ చేస్తూనే ఉండు! 'రాజీ'ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేచి ఉండలేము... అతి త్వరలో వచ్చేస్తోంది!’ అంటూ రాజ్ మరియు డీకేలు పేర్కొన్నారు. ఇకపోతే సమంత ఈ సిరీస్ లో టెర్రరిస్టుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది.

ఇప్ప‌టికే షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావాల్సింది. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న ఫ్యామిలీ మ్యాన్ 2 విడుద‌ల కాలేదు. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కు సీక్వెల్ గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ మే రెండో వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement