Samantha Gives Strong Counter To Netizen Who Commented On Her Looks, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: 'సమంత అందం, గ్లో తగ్గిపోయింది'.. జాలి చూపించిన నెటిజన్‌కు సామ్‌ చురకలు

Jan 10 2023 12:11 PM | Updated on Jan 10 2023 1:41 PM

Samantha Gives Strong Counter To Netizen Who Commented On Her Looks - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. శాకుంతలం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో సమంత పాల్గొనడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. ట్రైలర్‌లో సమంత అందానికి, నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మయోసైటిస్‌ నుంచి సమంత కోలుకుందా? ఇప్పుడు మునుపటిలా వరుస సినిమాలు చేస్తుందా అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో సమంత అందంపై ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కి సామ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. చదవండి:Samantha: సమంత మయోసైటిస్‌ నుంచి ఇంకా కోలుకోలేదా?

సమంతను చూస్తే జాలేస్తుంది. విడాకుల తర్వాత ధైర్యంగా నిలదొక్కుకొని కెరీర్‌ ఉన్నత స్థానంలో ఉందని భావిస్తుండగా మయోసైటిస్‌ ఆమెను దెబ్బతీసింది. ఆమెను మళ్లీ బలహీనురాలిని చేసింది. సామ్‌ అందం, గ్లో తగ్గిపోయింది. ఆమెను చూస్తూ బాధేస్తోంది అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. నాలాగా నెలల తరబడి ట్రీట్‌మెంట్‌ తీసుకునే పరిస్థితి నీకు రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది సామ్‌.చదవండి: గుణశేఖర్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement