
Samantha Diwali Celebration With Upasana Konidela: విడాకుల అనంతర ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది సమంత. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మోడల్ శిల్పారెడ్డితో ఎక్కువ సమయంలో గడుపుతున్నారు. ఈ క్రమంలో దీపావళి పండగను కూడా శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు ఉపాసన నిర్వహించిన దీపావళి వేడుకల్లో సామ్ తలుక్కుమన్నారు.
చదవండి: దీపావళి సందర్భంగా భావోద్వేగానికి లోనైన సమంత, ఏం చెప్పిందంటే..
తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి మెగా కోడలి ఉప్సీ దీవాళి వేడుకల్లో సామ్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు. అలాగే ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఉపాసన తల్లి, చెల్లితో పాటు పలువురు ప్రముఖులతో సినీ నటీనటులు పాల్గొన్నారు.
చదవండి:
చదవండి: రెమ్యునరేషన్ భారీగా పెంచిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతంటే..