డ్యూటీ ముగిసింది

Salman Khan wraps filming Prabhu Deva directorial Radhe - Sakshi

క్రిమినల్స్‌ అంతు చూడటానికి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా మారారు సల్మాన్‌ ఖాన్‌. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ‘మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ అన్నది ఉపశీర్షిక. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాలో స్టయిలిష్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు సల్మాన్‌. లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు. అనుకున్న తేదీ కంటే చిత్రీకరణ ముగిసిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్‌ పండగకు థియేటర్స్‌లోకి తీసుకురావాలన్నది యూనిట్‌ ప్లాన్‌ అని తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top