హిందీ ‘మాస్టర్‌’గా సల్మాన్‌ ఖాన్‌! | Salman Khan Will Act In Master Movie Hindi Remake | Sakshi
Sakshi News home page

హిందీ ‘మాస్టర్‌’గా సల్మాన్‌ ఖాన్‌!

Apr 5 2021 8:15 AM | Updated on Apr 5 2021 8:15 AM

Salman Khan Will Act In Master Movie Hindi Remake - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ మూవీ ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో హిందీలో రీమేక్‌ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్‌ పాత్రలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మాస్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. 

అయితే ఈ మూవీ హిందీ వెర్షన్‌లో బాలీవుడ్‌లో విడుదలైనప్పటికి ‘మాస్టర్‌’ హందీ రీమేక్‌కు నిర్మాత మురాద్‌ ఖేతని (కబీర్‌ సింగ్‌ నిర్మాత) రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో విజయ్‌ పాత్ర కోసం ఆయన ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ను సంప్రదించి కథ వివరించారట. మాస్టర్‌ స్టోరీ లైన్‌ను చెప్పినప్పుడు సల్మాన్‌ ఇంప్రెస్‌ అయ్యారని, కథలో కొన్ని సూచనలు చెప్పి, హిందీ ఆడియన్స్‌కు తగ్గట్లుగా మార్పులు చేయాలని కోరారట. మాస్టర్‌ కథ గురించి చెప్పాలంటే.. కాలేజీ స్టూడెంట్స్‌ ఇష్టపడే ఓ లెక్చరర్‌ కొన్ని పరిస్థితుల కారణంగా జైలుకు వార్డెన్‌గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బాల నేరస్థులను తన స్వార్థానికి ఉపయోగించుకునే ఓ రౌడితో ఈ లెక్చరర్‌ పోటపీపడి వారిని ఎలా కాపాడాడు అనేదే ‘మాస్టర్‌’ కథ. 

Advertisement
 
Advertisement
Advertisement