Salman Khan Sister: Arpita Khan Buys Luxurious House In Mumbai Deets Inside - Sakshi
Sakshi News home page

Salman Khan Sister Arpita Khan: సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలా? మజాకా? కోట్లు పెట్టి కొత్త ఇల్లు!

Feb 18 2022 11:35 AM | Updated on Feb 18 2022 12:10 PM

Salman Khan Sister Arpita Khan Buys Luxurious House In Mumbai - Sakshi

ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకుంది. బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ ఫ్లాట్‌ విస్తీర్ణం 1750 చదరపు గజాలు కాగా దీని కోసం అర్పిత ఏకంగా..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పిత ఖాన్‌ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకుంది. బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ ఫ్లాట్‌ విస్తీర్ణం 1750 చదరపు గజాలు కాగా దీని కోసం అర్పిత ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టింది. రిజిస్ట్రేషన్‌లో భాగంగా స్టాంప్‌డ్యూటీ కింద రూ.40 లక్షలు చెల్లించింది. ఈ వార్త విన్న నెటిజన్లు సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలా, మజాకా? ఎంతైనా వాళ్ల రేంజే వేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అర్పిత ఖాన్‌ నటుడు ఆయుశ్‌ శర్మతో కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసింది. 2014 నవంబర్‌ 18న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా అర్పిత దంపతులకు ఇద్దరు కుమారులు అఖిల్‌ శర్మ, అయత్‌ శర్మ జన్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement