Salman Khan Shows His Respect For Telugu Culture With Bathukamma Song - Sakshi
Sakshi News home page

Salman Khan : బాలీవుడ్‌ మెచ్చిన 'బతుకమ్మ' పాట.. పాన్‌ ఇండియాలో రీసౌండ్‌

Published Fri, Mar 31 2023 3:14 PM | Last Updated on Fri, Mar 31 2023 3:53 PM

Salman Khan Shows His Respect For Telugu Culture With Bathukamma Song - Sakshi

ఈమధ్య కాలంలో తెలంగాణ యాసలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. చాలామంది హీరోలు తమ చిత్రాల్లో తెలంగాణ యాస​, పాటలు ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సినిమాలోనూ తెలంగాణ సంప్రదాయానికి పెద్దపీట వేశారు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

ఏప్రిల్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడ‌దామా...గ‌డ‌ప‌కు బొట్టేట్టి తోర‌ణాలు క‌ట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఇది వెంకటేశ్‌ సలహా అని టాక్‌ వినిపిస్తుంది. ఐడియా నచ్చడంతో సల్మాన్‌ తన సినిమాలో పెట్టుకున్నారట. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు చెల్లెలిగా పూజా హెగ్డే నటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement