వారిని క్షమాపణలు కోరిన సల్మాన్‌ ఖాన్‌

Salman Khan Say Sorry To Theaters Exhibitors Over Radhe Movie Release - Sakshi

కరోనా కారణంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ మూవీ ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(మే 13) ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా, థియేటర్ల యాజమాన్యాలతో నిన్న(మంగళవారం) సల్మాన్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భాయిజాన్‌ ఎగ్జిబిట‍ర్లను క్షమాపణలు కోరాడట. ఎందుకంటే రాధే మూవీ ఎట్టి పరిస్థితుల్లోనైనా థియేటర్లలోనే విడుదల చేయాలని గతేడాది ఎగ్జిబిటర్ల సమాఖ్య ఆయనను కలిసి విన్నవించుకోగా సరే అని ఆయన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అయినప్పటికి కరోనా కారణంగా భాయిజాన్‌ వారికిచ్చిన మాట  తప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ క్షమాపణలు కోరుతూ.. ‘థియేటర్లలో విడుదల చేయాలని చాలా కాలం ఎదురు చూశాం. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాకపోపోగా రోజురోజు ఇంకా పరిస్థితి దిగజారుతోంది. అందువల్లే రాధేను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ వివరించాడు. అంతేగాక ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఇండియా థియేట్రికల్‌ రెవెన్యూ మొత్తం జీరో అయిపోయిందని తెలుసు, కానీ తప్పడం లేదంటూ విచారణ వ్యక్తం చేశాడు.

అదే విధంగా సల్మాన్‌ తన అభిమానులకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. పలు అభిమాన సంఘాలు రాధే మూవీ కోసం ఆడిటోరియాలను బుక్‌ చేసుకుని ప్రైవేటు స్రీనింగ్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని సల్మాన్‌ వ్యతిరేకిస్తు కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఇలా గుంపులుగా సినిమా చూడటం సరైంది కాదని, దీనికి తాను బాధ్యత వహించాల్సి ఉందటుందని హెచ్చరించాడు. కాగా ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడి దిశా పటానీ నటించింది. దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసి సిటీమార్‌ సాంగ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘రాధే’ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top