Salman Khan To Dance With Chiranjeevi In Godfather, News Goes Viral - Sakshi
Sakshi News home page

Salman Khan-Chiranjeevi: ‘నాటు నాటు’ రేంజ్‌లో చిరంజీవి, సల్మాన్‌ స్టెప్పులు!

Apr 5 2022 3:13 PM | Updated on Apr 5 2022 4:23 PM

Salman Khan To Dance With chiranjeevi In Godfather, News Goes Viral - Sakshi

నాటునాటు పాటను  ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇద్దరు స్టార్స్‌ని నటింపజేసి,బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు రాజమౌళి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే..  ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వేసిన స్టెప్పులు మరో ఎత్తు. తారక్, చరణ్ ఇద్దరు టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ కావడంతో నాటునాటు పాటను  ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడు ‘నాటు నాటు’సాంగ్‌ని చిరంజీవి ఫాలో అవుతున్నాడట. ఆయన హీరోగా నటిస్తున్న ‘గాఢ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. ఈ మూవీలో సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే చిరంజీవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్నాడట. 

మెగాస్టార్ స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లు.ఆచార్య కోసం ‘లాహే లాహే’, ‘సానా కష్టం’ పాటలలో చిరంజీవి వేసిన స్టెప్స్ రేపు థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం. ఇక గాఢ్‌ ఫాదర్‌లో చిరంజీవి మరింత రెచ్చిపోయి, స్టెప్పులు వేయనున్నాడట. అయితే సల్మాన్ డ్యాన్స్ చేయడం చాలా అరుదు. కేవలం తన ఛరిష్మాతో,కొన్ని సిగ్నేచర్ స్టెప్ప్ తో అలరిస్తుంటాడు సల్మాన్.కాని మెగాస్టార్ తో డ్యాన్స్ అంటే మాత్రం భాయ్ కూడా రెచ్చిపోయడం ఖాయం అనుకుంటున్నాడు ఫ్యాన్స్. చిరు, సల్మాన్ స్టెప్పులు గాడ్ ఫాదర్ సినిమాకు నాటు నాటు రేంజ్ కిక్ ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా గాడ్ ఫాదర్ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తన ట్యూన్ తో చిన్న సైజ్ మెగా తుపాన్ తీసుకురావడం ఖాయం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement