
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.
అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది.