ఎక్కడా కనిపించని 'సలార్‌' బజ్‌.. మరి సినిమా పరిస్థితి ఏంటి..? | Sakshi
Sakshi News home page

ఎక్కడా కనిపించని 'సలార్‌' బజ్‌.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?

Published Tue, Dec 12 2023 9:48 AM

Salaar Movie Still Did Not Promotions Events - Sakshi

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదలకు రెడీగా ఉంది.. కేజీఎఫ్ హిట్‌తో పాన్‌ ఇండియా సెన్సేషన్‌గా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ  ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు మాత్రం ఏమీ జరగడం లేదు. ఎప్పుడో సంక్రాంతికి వచ్చే సినిమాలు గుంటూరుకారం,సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ ప్రారంభించాయి.

ఈ క్రమంలో ఆ చిత్రాల నుంచి పోస్టర్స్‌, టీజర్స్‌,పాటలు ఇలా అప్పడప్పుడు ఎదో ఒకటి వదులుతూ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. కానీ మరో 10 రోజుల్లోపు వచ్చే సలార్‌ మేకర్స్‌ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉన్నారు. వీటంన్నిటికి తోడు తాజాగా సలార్‌పై మరో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదనే టాక్ వినిపిస్తోంది. మరోక ట్రైలర్‌ విడుదల చేసి చేతులు దులుపుకోవాలని సలార్‌ యూనిట్‌ చూస్తున్నట్లు సమాచారం. ప్రీ-రిలీజ్ లేకుండా నేరుగా సినిమా విడుదలకు వెళ్తే ఆ ప్రభావం కలెక్షన్స్‌ మీద పడవచ్చు.

ఇలా సలార్‌ చుట్టూ ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా ఆ టీమ్‌ మాత్రం సైలెంట్‌గా ఉంది. బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌ చిత్రం డంకీ కూడా సలార్‌కు పోటీగా ఉన్న విషయం తెలిసిందే. డంకీ కోసం చాలా రోజుల నుంచి షారుక్‌ టీమ్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కానీ బాలీవుడ్‌లో సలార్‌ టీమ్‌ ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్‌ కార్యక్రమం కూడా చేయలేదు. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల అవుతుంది అంటే.. ఢిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై,హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఆ చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలు ఉంటాయి.. కానీ సలార్‌ విషయంలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. సలార్‌ విషయంలో హోంబలే ఫిల్మ్​ మేకర్స్ వ్యూహం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. సలార్‌ మేకర్స్‌ నిర్లక్ష్యం పట్ల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అవుతున్నారు.


 

Advertisement
 
Advertisement