Sakshi Agarwal: షూటింగ్‌లో సాక్షి అగర్వాల్‌ బర్త్‌డే సందడి

Sakshi Agarwal Birthday Celebration On Sets Of The Night

Sakshi Agarwal Birthday Celebrations: పుట్టినరోజు అందరికీ పండగే అయితే సినిమా తారలకు ఇంకా స్పెషల్‌ అని చెప్పక తప్పదు. సహ నటీనటులు అందించే శుభాకాంక్షలు, అభిమానులు చేసే హంగామాలతో ఆ వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అనుభూతిని నటి సాక్షిఅగర్వాల్‌ అందుకున్నారు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ బహుభాషా నటిగా ప్రస్తుతం ది నైట్‌ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం భువనేశ్వర్‌ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కేరళలోని కడుంబాట్టుపార అనే దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతోంది. కాగా బుధవారం సాక్షి అగర్వాల్‌ పుట్టినరోజు కావడంతో ఆమెకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర యూనిట్‌ షూటింగ్‌ స్పాట్‌లో సాక్షి అగర్వాల్‌కు పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేసింది. ఆ వేడుకలో సాక్షి అగర్వాల్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి వారితో ఆనందాన్ని పంచుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top