Sai Pallavi Interesting Post About Her Sister Pooja Kannan First Movie - Sakshi
Sakshi News home page

Sai Pallavi About Pooja Kannan: ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్‌ పోస్ట్‌

Dec 3 2021 1:29 PM | Updated on Dec 4 2021 3:22 PM

Sai Pallavi Post About Her Sister Debut Movie - Sakshi

Sai Pallavi Post About Her Sister Debut Movie: సాయి పల్లవి పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో, డ్యాన్స్‌తో ఎంతగానో అలరించింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా కన్నన్‌ అరంగ్రేటం చేసిన తమిళ చిత్రం 'చితిరై సెవ్వానమ్‌' ఇవాళ (డిసెంబర్‌ 3) ఓటీటీ సంస్థ జీ5లో విడదలైంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది సాయి పల్లవి. డిసెంబర్‌ 3 తనకు ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించింది. తన చెల‍్లెలు పూజా కన్నన్‌ నటించే ప్రతి సినిమాతో ఎదగాలని ప్రార్థిస్థున్నాని తెలిపింది సాయి పల్లవి. 

సాయి పల్లవి తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, అనారోగ్యంతో ఉన్నట్లు నటించడం, అమ‍్మనాన్నలకు అబద్ధాలు చెప్పడం నుంచి క్లాస్‌లకు బంక్‌ కొట్టడం, డిప్రెషన్‌ సమంయలో కూడా చలాకీగా ఉండటం వరకు ఎదిగిన నా చెల్లిని, తన నటనను నేను మాత్రమే చూశాను. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఈరోజు చితిరై సెవ్వానమ్‌ చిత్రంతో నటిగా అరంగ్రేటం చేస్తోంది. మీరందరూ ఆ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దర‍్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న సిల్వా మాస్టర్‌కు, దర్శక నిర్మాత విజయ్ సర్‌ మీకు శుభాకాంక్షలు. పూజా ఇది నీకోసం. నువ్‌ ఎంతగా ఆస్వాదించి పాత్రలో లీనమైతే ప్రేక్షకులు నిన్ను అంతలా ఆదరిస్తారు. నువ్‌ నీ జర్నీని ఆస్వాదించాలని, నీ చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీ ఉండి మెరుగైన వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంటాను.' అంటూ రాసుకొచ‍్చింది. 

'చితిరై సెవ్వానమ్‌' చిత్రంతో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ సిల్వా దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు. తన వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వగానే తప్పిపోయిన ఐశ్వర్య అనే అమ్మాయి గురించి తండ్రి వెతుకుతూ ఉంటాడు. ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకుంటాడు. మరీ అతను తన కుమార్తెను కనిపెట్టాడా లేదా అనేదే సినిమా కథ. ఇందులో సముద‍్ర ఖని, రిమా కల్లింగల్‌ కీలక పాత్రల్లో నటించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement