‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ! | Sai Pallavi Play Title Role In Balagam Venu Yellamma Movie | Sakshi
Sakshi News home page

‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ‘బలగం’వేణు ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా!

Dec 27 2024 4:08 PM | Updated on Dec 27 2024 4:51 PM

Sai Pallavi Play Title Role In Balagam Venu Yellamma Movie

వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. నితిన్‌ హీరోగా ‘బలగం’ ఫేమ్‌ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తారు. 

వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. 

 ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్‌ రాజు భావిస్తున్నారట.  దిల్‌ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్‌ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.  

Advertisement
 
Advertisement
Advertisement