సుకుమార్ స్క్రీన్‌ప్లేతో..

సాయితేజ్ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎ¯Œ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. సుకుమార్ వద్ద రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని రాయడంతోపాటు షట్‌చక్రంలో ఓ కన్నుని ఈ పోస్టర్‌లో పొందుపరిచారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి