మేఘా ఆకాశ్ కొత్త సినిమా.. డిఫరెంట్ టైటిల్ | Sahakutumbanaam Movie Starring Megha Akash shoot begins | Sakshi
Sakshi News home page

Megha Akash: మేఘా ఆకాశ్ కొత్త సినిమా.. డిఫరెంట్ టైటిల్

Sep 24 2023 5:48 PM | Updated on Sep 24 2023 6:24 PM

Sahakutumbanaam Movie Starring Megha Akash shoot begins - Sakshi

మేఘాఆకాశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న కొత్త సినిమాకు 'సఃకుటుంబ‌నాం' పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో ఆదివారం లాంచనంగా ఈ చిత్రం ప్రారంభ‌మైంది. రామ్ కిరణ్ హీరోగా నటిస్తుండగా.. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం నిర్మిస్తున్నారు. ఉద‌య్‌శ‌ర్మ దర్శకుడు. హీరో, హీరోయిన్‌ల‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ కొరియోగాఫ్ర‌ర్ చిన్నిప్ర‌కాష్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. 

(ఇదీ చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!)

సినిమాలో త‌న పాత్ర గురించి విన‌గానే కొత్త హీరో అని చూడ‌కుండా మేఘా ఆకాష్ వెంట‌నే ఒప్పుకున్నారని దర్శకుడు చెప్పాడు. క్లీన్‌ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా న‌చ్చిన పాత్ర. ఇందులో న‌టించ‌డం ఆనందంగా వుందని చెప్పింది. ఈ మూవీలో రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ విజేత చేతికి అందని రూ.25 లక్షలు.. పట్టించుకోని టీమ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement