
సాక్షి, చెన్నై: మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయా ణంగా మార్చుకున్న నయనతార తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి పెర్ఫార్మెన్స్ పాత్ర ల వరకు శభాష్ అని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న తార ఈ నయనతార. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి ఈమెనే.
ఇప్పుడు ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తున్న వార్త.
ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అని తెలియాలంటే నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తారక్