వద్దని చెప్పినా వినకుండా ఫోటోలు తీశారు: హీరోయిన్‌ అసహనం | Rukshar Dhillon Angry on Taking Photos After She Denied | Sakshi
Sakshi News home page

Rukshar Dhillon: అసౌకర్యంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు.. నా ఫోటోలు తీశారు

Mar 6 2025 9:05 PM | Updated on Mar 6 2025 9:27 PM

Rukshar Dhillon Angry on Taking Photos After She Denied

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ ధిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం దిల్‌రూబా (Dilruba Movie). విశ్వకరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) దిల్‌రూబా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రుక్సార్‌ (Rukshar Dhillon) తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది. దిల్‌రూబా సినిమాలో నేను పోషించిన అంజలి పాత్రకు కనెక్ట్‌ అయ్యాను. ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం ఉంది. 

రుక్సార్‌ సీరియస్‌
మీకు కచ్చితంగా నచ్చుతుందని నేను బలంగా చెప్పగలను అని చెప్పుకొచ్చింది. చివర్లో మాత్రం ఓ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటినుంచి దీని గురించి మాట్లాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. కాస్త భయపడుతూనే ఉన్నాను. కానీ ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. మీరు ఎప్పుడుపడితే అప్పుడు ఫోటోలు తీస్తూనే ఉంటారు. నాకు కాస్త అసౌకర్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. 

అసౌకర్యంగా ఉందని చెప్పినా..
మీరు అసౌకర్యంగా ఫీల్‌ అవుతున్నప్పుడు ఎదుటివాళ్లు వచ్చి మిమ్మల్ని ఫోటో తీస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా! కాస్త ఇబ్బందిగా ఉంది.. దయచేసి నా ఫోటోలు తీయకండి అని ఎంతో ప్రేమగా, గౌరవంగా చెప్పాను. కానీ కొందరు అస్సలు వినిపించుకోలేదు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. ఈ మెసేజ్‌ వారికి చేరుతుందని ఆశిస్తున్నాను అని సీరియస్‌ అయింది.

చదవండి: నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement