వారణాసిలో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ఉపాసన మ్యాజికల్‌ వీడియో | RRR Rajamouli Ram Charan Jr NTR In Varanasi Upasana Video Post | Sakshi
Sakshi News home page

RRR Movie: వారణాసిలో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. వీడియో వైరల్

Mar 23 2022 6:49 PM | Updated on Mar 23 2022 7:25 PM

RRR Rajamouli Ram Charan Jr NTR In Varanasi Upasana Video Post - Sakshi

RRR Rajamouli Ram Charan Jr NTR In Varanasi Upasana Video Post: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన తర్వాత వేగంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.  మార్చి 20న గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టగా, సోమవారం (మార్చి 21) పంజాబ్‌లోని అమృత్‌సర్‌, కోల్‌కత్తాలో పర్యటించింది ఈ చిత్రబృందం. అలాగే మంగళవారం (మార్చి 22) వారణాసిలో  గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ పర్యటనలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సాంప్రదాయ దుస్తులు ధరించి కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ గంగా హారతిలో పాల్గొన్నారు.  వీరితోపాటు  రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ వారణాసి ట్రిప్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. వారణాసిలో వారు పర్యటించిన విధానాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. 'వారణాసి నువ్వు ఎప్పటిలానే మ్యాజికల్‌... ఆర్‌ఆర్ఆర్‌ను చూసేందుకు సూపర్‌ ఎగ్జైటెడ్‌గా ఉన్నాను' అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు ఉపాసన. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement