
SS Rajamouli Gave Interesting Update From RRR Movie: ధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన ప్రాత్రలలో నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు జక్కన్న. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ నుంచి హృదయాలను పిండేసే పాట రానుందంటూ ఆసక్తికర క్యాప్షన్, ఫొటోతో ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఈ పాటను నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా?
‘ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి ఆత్మీయ పాట. ‘జనని’ కోసం పెద్దన్న ఇచ్చిన అద్భతమైన సౌల్‌ఫుల్ మ్యూజిక్ కంపోజింగ్. ఆర్ఆర్‌ఆర్‌లో హృదయాన్ని పిండేసే భావోద్వేగాలు’ అంటూ అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన మాస్ సాంగ్ నాటూ నాటూకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట స్పూఫ్‌లు దర్శనం ఇస్తున్నాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.