
‘‘మొగలి రేకులు’ సీరియల్‌లో నేను చేసిన ΄పోలీస్ క్యారెక్టర్ ఆర్కే నాయుడు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్‌కి భిన్నమైన క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్’ వంటి సినిమాలు చేశాను. మళ్లీ ఒక పోలీస్ పాత్ర చేయాలంటే బలమైన కథ కుదరాలి. అలాంటి కథ ‘ది 100’(The 100 Movie)లో కుదిరింది. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరయుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఈ సినిమాకి అంత పవర్ ఉంది’’ హీరో ఆర్‌కే సాగర్ తెలిపారు.
ఆర్‌కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100 ’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ, విష్ణుప్రియ కీలక పాత్రలు పోషించారు. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఆర్‌కే సాగర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘వెండితెరపై చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ ‘ది 100’ మాత్రం ప్రతి ΄ోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. నేను చేసిన విక్రాంత్ ఐపీఎస్ ΄ాత్రకి ఎంత ్ర΄ాధాన్యం ఉందో మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణ, విష్ణు ప్రియ పాత్రలూ సినిమాలో కీలకంగా ఉంటాయి. ప్రత్యేకించి మిషా పాత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు... ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచనతో ‘ది 100’ మొదలైంది. ఓసారి సుకుమార్‌గారికి ఈ పాయింట్ చెబితే, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రమేశ్, వెంకీగార్లు ఈ కథపై నమ్మకంతో నిర్మించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రూ΄÷ందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడాలి. ‘ది 100’కి సీక్వెల్ చేసే చాన్స్ ఉంది’’ అని చెప్పారు.