breaking news
The 100 Movie
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ థ్రిల్లర్.. ఏకంగా టాప్-3లో ట్రెండింగ్!
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు డిజిటల్‌గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇండియా వ్యాప్తంగా టాప్-3లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్‌లో భారతదేశంలో టాప్ -3లో ట్రెండింగ్ అవుతోంది. మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన చిత్రం ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.తాజాగా ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోందని తెలిపారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు. పోలీస్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారు ది 100 చూసి ఎంజాయ్ చేయండి. (ఇది చదవండి: ‘ది 100’ మూవీ రివ్యూ)గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ–'సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్‌లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది' అని అన్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
‘ది 100’ విజయం ఆరంభం మాత్రమే : రాఘవ్ ఓంకార్ శశిధర్
"ది 100" చిత్రంతో తొలి దర్శకుడిగా అడుగుపెట్టి, బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వచ్చిన స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ, "ఈ చిత్రం కేవలం పోలీస్ కథ కాదు, భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథాంశం. నిజాయితీ గల ఐపిఎస్ అధికారి విక్రాంత్‌గా ఆర్కే సాగర్, అలాగే మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎమోషన్స్‌తో బాగా కనెక్ట్ అయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, అంజనా దేవి, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. థియేటర్లలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకు, నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్కే సాగర్లకు కృతజ్ఞతలు. ఈ విజయం నా జర్నీలో మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాను," అని అన్నారు. -
ప్రతి ఇంట్లో విక్రాంత్..!
‘‘ది 100’ చిత్రంలో ప్రతిపాత్రకి ప్రాముఖ్యత ఉంది. సినిమాని థియేటర్స్‌లో చూడండి... ఏ ఒక్కర్నీ నిరుత్సాహ పరచదు. మా సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం... అంత నమ్మకంగా చెబుతున్నాను’’ అని ఆర్కే సాగర్ అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ది 100’. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ఆర్కే సాగర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ఆర్కే నాయుడుపాత్రలాగే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి నచ్చింది. ఇంకా మంచి కథలు చెప్పాలనే స్ఫూర్తిని ప్రేక్షకులు ఇచ్చారు’’ అని తెలిపారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్‌లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది’’ అని రమేశ్ కరుటూరి తెలిపారు. మిషా నారంగ్, నటుడు రాజా రవీంద్ర,పాటల రచయిత రాంబాబు గోసాల మాట్లాడారు. -
‘ది 100’ మూవీ రివ్యూ
టైటిల్ : ది 100నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులునిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్విడుదల తేది : జులై 11, 2024‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీ(The 100 Movie Review)తో నేడు( జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘ది 100’ కథేంటంటే..విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The 100 Movie Review).ఎలా ఉందంటే..విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్‌ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ (The 100 Movie Review)కొంతవరకు మాత్రమే సఫలం అయింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్‌గా హీరో ఎంట్రీ సీన్‌ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్‌బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి సందేశం ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. సెకండాఫ్‌లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆమె పాత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు : ఆర్కే నాయుడు
‘‘మొగలి రేకులు’ సీరియల్లో నేను చేసిన ΄పోలీస్ క్యారెక్టర్ ఆర్కే నాయుడు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్‌కి భిన్నమైన క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్’ వంటి సినిమాలు చేశాను. మళ్లీ ఒక పోలీస్ పాత్ర చేయాలంటే బలమైన కథ కుదరాలి. అలాంటి కథ ‘ది 100’(The 100 Movie)లో కుదిరింది. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరయుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఈ సినిమాకి అంత పవర్ ఉంది’’ హీరో ఆర్కే సాగర్ తెలిపారు. ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100 ’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ, విష్ణుప్రియ కీలక పాత్రలు పోషించారు. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘వెండితెరపై చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ ‘ది 100’ మాత్రం ప్రతి ΄ోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. నేను చేసిన విక్రాంత్ ఐపీఎస్ ΄ాత్రకి ఎంత ్ర΄ాధాన్యం ఉందో మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణ, విష్ణు ప్రియ పాత్రలూ సినిమాలో కీలకంగా ఉంటాయి. ప్రత్యేకించి మిషా పాత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు... ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచనతో ‘ది 100’ మొదలైంది. ఓసారి సుకుమార్‌గారికి ఈ పాయింట్ చెబితే, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రమేశ్, వెంకీగార్లు ఈ కథపై నమ్మకంతో నిర్మించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రూ΄÷ందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడాలి. ‘ది 100’కి సీక్వెల్ చేసే చాన్స్ ఉంది’’ అని చెప్పారు.