Rishab Shetty : 'కాంతార' సినిమాకి రిషబ్‌ శెట్టి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Rishab Shetty Shocking Remuneration For Kantara Movie - Sakshi

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ​ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

కేవలం రూ. 16కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన కాంతార హీరోకు రెమ్యునరేషన్‌ ఎన్ని కోట్లు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దర్శకుడిగానే కాకుండా హీరోగా చేసిన రిషబ్‌ శెట్టికి పారితోషికం కింద రూ. 4కోట్లు మాత్రమే చెల్లించారట. కనీసం సినిమా సూపర్‌ హిట్‌ అయ్యాక అయినా హోంబేల్ ప్రొడక్షన్స్ రిషబ్‌ శెట్టికి అదనంగా రెమ్యునరేషన్‌ ఇవ్వడం, లేదా కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇవ్వడం వంటివి కూడా జరగలేదనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top